ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు కష్టమయ్యేలా కనిపించడంతో జమ్మూ- కశ్మీర్‌లోని అనంత్‌నాగ్- రాజౌరీ లోక్‌సభ స్థానంలో ఎలక్షన్స్ ను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం నాడు నిర్ణయించింది. ఎన్నికల తేదీ మినహా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, తొలుత ఈసీ ప్రకటించిన తేదీ ప్రకారమైతే మే 7న అక్కడ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా 20 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
Read Also: Pensions Distribution: గుడ్‌న్యూస్.. నేటి నుండి పెన్షన్ల పంపిణీ
ప్రస్తుతం, అక్కడ, హిమపాతంతో రవాణా సమస్య, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికల తేదీ మార్చాలని వివిధ పార్టీలు కోరడంతో ఈసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా, ఈసీ నిర్ణయాన్ని పీడీపీ పార్టీ తప్పుబట్టింది. అయితే, ప్రజా ప్రాతినిథ్య చట్టం-1951లో సెక్షన్-56 కింద పోలింగ్ తేదీని మే 7వ తేదీ నుంచి 25కు మార్చినట్టు ఎన్నికల కమిషన్ చెప్పుకొచ్చింది.
