Site icon NTV Telugu

Vice President Election: నేడు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక..

Vp Election

Vp Election

భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీపడుతున్నారు. వసుధలోని రూమ్ నంబర్ F-101లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10 గంటలకు ఓటు వేస్తారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, లోక్‌సభ (543 మంది సభ్యులు), రాజ్యసభ (233 మంది ఎన్నికైనవారు, 12 మంది నామినేటెడ్ సభ్యులు) లోని అన్ని ఎంపీలు ఓటు వేస్తారు. ప్రస్తుతం, 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉన్నందున 781 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు.

Also Read:Nepal Protest: నేపాల్ రక్తపాతం.. దేశ హోం మంత్రి రాజీనామా..

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 386 ఓట్లు దక్కించుకున్న వాళ్లు విజేతగా నిలువనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్(4 ఎంపీలు), బీజేడీ (7 ఎంపీలు) ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది మర మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు.

Exit mobile version