NTV Telugu Site icon

Election Schedule Announcement: మోగిన ఎన్నికల నగారా… 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్

Ele

Ele

Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ తో పాటు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. 18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు. కాగా, ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషన్.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలను నిర్వహించింది.

EC Press Conference Live : Election Schedule Announcement | Election Commission Of India Live | Ntv

The liveblog has ended.
  • 16 Mar 2024 04:12 PM (IST)

    ఏ రాష్ట్రంలో.. ఏ దశలో పోలింగ్‌?

    *యూపీ, బీహార్‌, బెంగాల్‌లో ఏడు దశల్లో పోలింగ్
    *మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు
    *ఛత్తీస్‌గఢ్, అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు
    *కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు దశల్లో పోలింగ్
    *ఏపీ, తెలంగాణ సహా మిగిలిన 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు

  • 16 Mar 2024 03:55 PM (IST)

    దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్

    దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
    *ఏప్రిల్‌ 19 -తొలి దశ ఎన్నికలు
    *ఏప్రిల్ 26- రెండో దశ పోలింగ్.. రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్
    *మే 7న మూడో దశ పోలింగ్
    *మే 13న నాల్గో దశ పోలింగ్- ఈ రోజనే ఏపీ, తెలంగాణ పోలింగ్.. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు పోలింగ్
    *మే 20న ఐదో దశ పోలింగ్
    *మే 25న ఆరోదశ పోలింగ్
    *జూన్‌ 1న ఏడో దశ పోలింగ్

    ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జూన 4న కౌంటింగ్ జరుగుతుందని సీఈవో రాజీవ్‌కుమార్ ప్రకటించారు.

  • 16 Mar 2024 03:52 PM (IST)

    ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్‌ 18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు.

    *మే 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
    *జూన్‌ 4న ఫలితాలు
    *ఏప్రిల్‌ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌
    *ఏప్రిల్‌ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు
    *ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన
    *ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు

  • 16 Mar 2024 03:47 PM (IST)

    2100 మంది ఎన్నికల అబ్జర్వర్లు

    2100 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించామని సీఈవో రాజీవ్‌కుమార్‌ తెలిపారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడవద్దని సూచించారు. పార్టీల మిస్‌ లీడింగ్ వ్యాఖ్యలను అనుమతించమన్నారు.

  • 16 Mar 2024 03:45 PM (IST)

    కులమతాలను రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దు..

    ఫేక్‌ న్యూస్‌పై ఫ్యాక్ట్‌ చెక్‌ ఫెసిలిటీ పెట్టిస్తామని సీఈవో వెల్లడించారు. స్టార్‌ క్యాంపెయినర్లకు గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు. కులమతాలను రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కులం, మతం పేరుతో ఓట్లు అడగొద్దన్నారు. ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఉండకూడదన్నారు. సూర్యాస్తమయం తర్వాత బ్యాంకుల క్యాష్ వ్యాన్లను కూడా అనుమతించబోం అని స్పష్టం చేశారు.

  • 16 Mar 2024 03:38 PM (IST)

    పోలింగ్ డ్యూటీలో వాలంటీర్లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి నో ఎంట్రీ

    పోలింగ్ డ్యూటీలో వాలంటీర్లు, కాంట్రాక్ట్‌ సిబ్బందికి అనుమతి లేదని ఈ సందర్భంగా సీఈవో రాజీవ్‌ కుమార్ తెలిపారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3400 కోట్లు సీజ్‌ చేశామన్నారు. బ్యాంక్‌ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ జరుగుతుందన్నారు. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల నియామకం జరుగుతుందన్నారు. ఓటు వేసిన వారు మళ్లీ ఓటు వేయడానికి వస్తే కేసు బుక్‌ చేస్తామన్నారు.

  • 16 Mar 2024 03:33 PM (IST)

    పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం

    పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్ల వాడకం జరుగుతుందని సీఈవో రాజీవ్‌కుమార్ తెలిపారు. ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. హింసకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ అవుతాయని హెచ్చరించారు.

  • 16 Mar 2024 03:28 PM (IST)

    85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఓట్‌ ఫ్రం హోం ఆప్షన్‌

    85 ఏళ్లు దాటిన వారికి ఓట్‌ ఫ్రం హోం ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని సీఈవో రాజీవ్‌ కుమార్ తెలిపారు. దేశంలో 85 ఏళ్లు నిండిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారన్నారు. దివ్యాంగులకు కూడా ఓట్‌ ఫ్రం ఆప్షన్‌ వర్తిస్తుందన్నారు.

  • 16 Mar 2024 03:26 PM (IST)

    దేశవ్యాప్తంగా అమల్లోకి ఎన్నికల కోడ్

    జూన్‌ 16 లోపు కల ప్రక్రియ పూర్తవుతుందని సీఈవో రాజీవ్‌కుమార్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామని తెలిపారు. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారని తెలిపారు. దేశంలో 48 వేల ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

  • 16 Mar 2024 03:20 PM (IST)

    దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు

    దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు.. కోటీ 80 లక్షల మంది కొత్త ఓటర్లు.. దేశవ్యాప్తంగా 49.7 కోట్ల పురుష ఓటర్లు, 47.1 కోట్ల మహిళా ఓటర్లు.. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు.. జూన్‌ 16తో ముగియనున్న ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు.. కశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. -సీఈవో రాజీవ్‌ కుమార్

  • 16 Mar 2024 03:10 PM (IST)

    ఎన్నికల్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తున్న ఈసీ

    కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేస్తోంది.