NTV Telugu Site icon

Amit Shah: అమిత్‌షా హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)

Amithshah

Amithshah

ఎన్నికల సంఘం అధికారులు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెలికాప్టర్‌ను, బ్యాగును తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ స్వయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పంచుకున్నారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన ఈరోజు హింగోలి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్నికల సంఘం అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశారు. “ఈ రోజు మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో నా హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత ఎన్నికలు, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తుంది. గౌరవనీయమైన ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను అనుసరిస్తుంది. మనమందరం ఎన్నికల వ్యవస్థకు సహకరించాలి. భారతదేశాన్ని ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్యంగా ఉంచడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి.” అని రాసుకొచ్చారు.

READ MORE: Pune: మూడంతస్తుల బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారుల సాహస దృశ్యాలు వైరల్

కాగా.. హోం మంత్రి అమిత్ షా షేర్ చేసిన వీడియోలో ఎన్నికల అధికారులు ఆయన హెలికాప్టర్‌ను తనిఖీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఇదిలా ఉండగా.. హారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీల పరంపర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం లాతూర్, యవత్మాల్ జిల్లాల్లో ఎన్నికల సంఘం అధికారులు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగ్ ని తనిఖీ చేశారు. ఈ దర్యాప్తునకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకుంటూ.. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికార కూటమిలోని ఇతర సీనియర్ నాయకులకు కూడా ఇదే నిబంధనలు వర్తింపజేయాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌ల బ్యాగులను కూడా పరిశీలించగా వాటికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి.

Show comments