NTV Telugu Site icon

Election Commission: ఏడో దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

Ec

Ec

Lok Sabha Elections 2024: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ పూర్తి అయింది. అయితే, మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇవాళ (బుధవారం) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. ఈ 15వ తేదీన నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు.

Read Also: CM Revanth Reddy: బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

ఇక, ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. జూన్ 1వ తేదీన ఓటింగ్ జరగనుండగా.. జూన్ 4న అన్ని దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్‌ 9, ఉత్తరప్రదేశ్‌‌ 13, పంజాబ్‌ 13 , బీహార్‌ 8, ఒడిశా 6, హిమాచల్‌ ప్రదేశ్‌ 4, జార్ఖండ్‌‌లో 3 స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్ సభ స్థానానికి కూడా 7వ దశలోనే పోలింగ్ జరగబోతుంది.