AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ మరో లేఖ రాసింది. సంక్షేమ పథకాలకు నిధులు విడుదలపై వివిధ ప్రశ్నలు లేవనేత్తుతూ ఈసీఐ లేఖ రాసింది. కాగా, లేఖలో ఈసీఐ అంశాలు.. జనవరి 2024 నుంచి మార్చి 2024 వరకు డీబీటీలకు నిధులెందుకు ఇవ్వలేదు?.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పండి?.. ఇప్పటి వరకు జమ చేయలేని ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కసారిగా నిధులెలా సర్దుబాటు అయ్యాయి?.. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెపుతారు? అంటూ ప్రశ్నించింది. ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా? అని లేఖలో అడిగింది.
Read Also: Pm Modi: శివసేన(యూబీటీ)పై మోడీ ఫైర్.. ఏమన్నారంటే..?
గత ఐదేళ్లగా సంక్షేమ పథకాలకు నిధులు బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏపీ సీఎస్ ను అడిగింది. ఇప్పుడు మాత్రమే నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?.. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారు?.. ఈరోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటీ?.. సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి.. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని ముందుగా తెలియదా? అని లేఖలో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందర ఏం వచ్చింది?.. ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించండి.. ఈ క్లారిఫికేషన్లన్నీ ఈ సాయంత్రం మూడు గంటల వరకు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు జవహర్ రెడ్డికి ఈసీ తెలియజేసింది.
PM Narendra Modi First Ever Exclusive Interview With NTV Telugu