NTV Telugu Site icon

Election Code: నేడే ఎన్నికల కోడ్ అమలు.. షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ..

Ec

Ec

Election Commission: అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్‌ ఇవాళ (శనివారం) వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు సైతం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అలాగే, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిన్ననే (శుక్రవారం) పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది.

Read Also: Lok Sabha Election 2024 : కాంగ్రెస్ ఆశలకు గండికొట్టిన అఖిలేష్ యాదవ్!

కాగా, ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్‌ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్‌ వచ్చిన వెంటనే దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎన్నికల కోడ్‌) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 16వ తేదీతో ముగిసిపోతుండగా.. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న వెల్లడించారు. దీంతో ఏప్రిల్‌ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు కొనసాగాయి. మే 23న ఫలితాలు వచ్చాయి. అయితే, ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయబోతుంది.

Show comments