Site icon NTV Telugu

Eggshells: కోడి గుడ్డు పెంకులతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే.. అస్సలు పడేయ్యరు..!

Eggshells

Eggshells

కూరగాయల తొక్కలను ఎరువుగా ఎలా ఉపయోగిస్తామో కోడి గుడ్డు పెంకులను కూడా ఎరువుగా ఉపయోగిస్తే మంచి ఫలితాలను చూడవచ్చు.. మనం గుడ్లను కూడా వండుతున్నప్పుడు వాటి షెల్స్‌ను కూడా డెస్ట్ బిన్‌లలోకి పోతూ ఉంటాయి. తీసి పారేసే ఈ తొక్కల్లో ఎన్నో గుణాలు కూడా ఉంటాయి. కూరగాయల తొక్కలను ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇవి తేలికదా మట్టిగా మారి మంచి ఎరువుగా పనిచేస్తాయి.. మంచి సేంద్రియ ఎరువుగా మారి మొక్కలకు బలాన్ని ఇవ్వడంతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.. అసలు ఈ గుడ్డు పొట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గుడ్డు పెంకులు మొక్కల మట్టిలో వేయవచ్చు. ఇది మట్టికి కాల్షియం వంటి పోషకాలు, ఖనిజాలను అందిస్తుంది. గుడ్డు పెంకులను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. చర్మ సంరక్షణలో గుడ్డు పెంకులను కూడా చేర్చవచ్చు. కోడిగుడ్డు పెంకులను గ్రైండ్ చేసి అందులో తేనె కలిపి ముఖానికి స్క్రబ్ లాగా రాసి కాసేపు ఉంచిన తర్వాత కడిగేయాలి.. ఇలా చెయ్యడం వల్ల ముఖం నీటిగా మారుతుంది.. రంగు కూడా మారుతుంది..

ప్రస్తుతం వర్షాకాలంలో ఇంట్లో కీటకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి గుడ్డు పెంకులు ఉపయోగించవచ్చు.. పసుపు పళ్లను శుభ్రపరచడంలో ఈ పీల్స్ అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది. గుడ్డు పెంకులను మెత్తని పొడిగా చేసి, ఈ పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసి దంతాల మీద రుద్దాలి. దీంతో దంతాలు మళ్లీ మెరుస్తాయి. గుడ్డు పెంకులు మురికి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. పాత్రలో ఏదైనా కాలిపోయి, మొండిగా ఉన్న మురికి పోకపోతే, గుడ్డు పెంకులను పగలగొట్టి తోమండి..యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని గుడ్డు పెంకులను వేయండి. చికాకు కలిగించే చర్మనికి ఉపశమనం అందిస్తుంది.. ఇంకా మోకాళ్లకు, మోచేతులకు మెడకు కూడా పట్టిస్తే నలుపు పోయి మంచి రంగు వస్తుంది..

Exit mobile version