Site icon NTV Telugu

Eesha Rebba : ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ పోజులిస్తూ రెచ్చగొడుతుందిగా..

Whatsapp Image 2023 08 23 At 3.47.20 Pm

Whatsapp Image 2023 08 23 At 3.47.20 Pm

ఈషా రెబ్బా.. ఈ భామ గత కొంత కాలంగా ఆఫర్ల విషయంలో ఎంతగానో ఇబ్బంది పడింది. గత రెండు మూడేళ్లుగా ఈ బ్యూటీకి తెలుగు లో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళం మరియు మలయాళం వైపు చూసింది. అక్కడ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది. కానీ అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు.. దీంతో మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పై ఫోకస్‌ పెట్టింది.జేడీ చక్రవర్తి నటించిన `దయా`లో ఈషా రెబ్బా గర్భవతి గా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో డీ గ్లామర్‌ లో అదరగొట్టింది..ఈ సిరీస్ లో తనలోని మరో యాంగిల్‌ ని ఆవిష్కరించింది ఈషా రెబ్బా. దీంతో ఈ బ్యూటీ అద్భుతం గా చేసిందంటూ అంతా ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‌ కి మంచి ఆదరణ కూడా దక్కుతుంది.ఈ సిరీస్ తో జేడీ చక్రవర్తి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.

ఈ సిరీస్ పాటు సుధీర్‌బాబు తో కూడా ఓ సినిమా చేస్తుంది ఈషా రెబ్బా.సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న `మామా మశ్చింద్ర` చిత్రం లో ఈషా రెబ్బా హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమా లో సుధీర్ బాబు మూడు డిఫరెంట్‌ రోల్స్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సుధీర్ బాబు లావుగా వుండే పాత్రకు ఈషా రెబ్బా జోడీగా నటిస్తుంది.దీంతో పాటు ఈ భామ ఇంకో రెండు సినిమా ఆఫర్స్ దక్కించుకున్నట్లు సమాచారం.. మరోవైపు ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోషూట్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంది. ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ ఫోజులిస్తూ రెచ్చగొట్టింది.బిగుతైన డ్రెస్ లో ఆకట్టుకునే స్ట్రక్చర్ చూపిస్తూ మతి పోగొట్టింది.మరో వైపు కిల్లింగ్ చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి..

Exit mobile version