NTV Telugu Site icon

Shankar: డైరెక్టర్‌ శంకర్‌కు షాక్ ఇచ్చిన ఈడీ.. ఏకంగా రూ.10 కోట్లు..

Director Shankar

Director Shankar

ప్రముఖ డైరెక్టర్ శంకర్‌ కు ఈడీ షాక్ ఇచ్చింది. దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 17న ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ తాజాగా తెలిపింది. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా చేశాయి.

READ MORE: Off The Record: బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది? కేటీఆర్, కవిత మీటింగ్స్ లో మోగుతున్న సీఎం నినాదాలు

2010లో విడుదలైన ఈ సినిమా 15సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది తన కథ అని.. ‘జిగుబా’ను కాపీ కొట్టి శంకర్‌ ‘రోబో’ సినిమా తీశారని.. అరూర్‌ తమిళనాథన్‌ అనే వ్యక్తి 2011లో పిటిషన్‌ దాఖలు చేశారు. శంకర్‌ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక కూడా దీన్ని ఒప్పుకుంది. జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య చాలా పోలికలున్నాయని వెల్లడించింది. కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63ని శంకర్ ఉల్లంఘించినట్టు ఆ వివరాల ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తోంది.

READ MORE: Off The Record: పవన్‌ను వదిలేసి చంద్రబాబునే జగన్ టార్గెట్ చేశారా..? ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది?