ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ 22బెట్ ఇండియాకు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటననలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్ లో రిజిస్టర్ అయిన బెట్ 22తో గత నవంబర్ లో మెకల్లమ్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ( ఈసీబీ ) దీనిపై ఫోకస్ పెట్టింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్ లో పాల్గొనడం.. పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు.. టీమ్ హెడ్ కోచ్ గా మెకల్లమ్ కు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
Read Also : Fake Encounters: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్లు.. మాఫియాపై యోగి, అఖిలేష్ మధ్య వార్
ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్ లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో 22బెట్ ఇండియాపై ఆ దేశం నిషేదం విధించింది కూడా.. ఆ దేశానికి చెందిన ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్ గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టు మ్యాచ్ లు గెలిచింది. మరి ఈసీబీ ఈ అంశంపై అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మెకల్లమ్ పై చర్యలు తీసుకుంటే ఇంగ్లండ్ టెస్ట్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన యాషిస్ సిరీస్ ముందు మెకల్లమ్ పై వేటు వేస్తే ఇంగ్లండ్ టీమ్ పరిస్థితి ఏంటీ అనేది ప్రశ్నార్థకం కానుంది.
Read Also : IPL 2023 : నితీష్ రాణా దెబ్బకు ఏడ్చినంత పని చేసిన ఉమ్రాన్ మాలిక్