Site icon NTV Telugu

“లోక్ జనశక్తి” పార్టీ వివాదంపై ఈసీ మధ్యంతర ఉత్తర్వులు…

“లోక్ జనశక్తి” పార్టీ వివాదంపై ఈసీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. “లోక్ జనశక్తి” పార్టీ పేరు, సింబల్ ను ఎవరు ఉపయోగించవద్దని ఆదేశాలు జాతి చేసింది. “లోక్ జనశక్తి” పార్టీ తమదంటే తమదని అంటున్నాయి చిరాగ్ పాశ్వాన్, పరాస్ పాశ్వాన్ వర్గాలు. ఈ వివాదం కొలిక్కి వచ్చేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్ జె పి పేరు, ఎన్నికల గుర్తు “బంగళా” ను ఉపయోగించవద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఎల్ జె పి పేరు తో కలిపి మరొక పేరు ఉపయోగించుకునేందుకు రెండు గ్రూపులకు అనుమతి ఇచ్చింది. రామ్ విలాస్ పాశ్వాన్ చనిపోవడంతో పార్టీని చేజిక్కించుకున్నారు ఆయన తమ్ముడు పారాస్ పాశ్వాన్. ఇటీవలే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పారాస్ పాశ్వాన్ వెంటే మెజారిటీ పార్టీ నాయకులు ఉన్నారు.

Exit mobile version