Site icon NTV Telugu

AP Elections 2024: తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఈసీ సీరియస్‌.. కీలక ఆదేశాలు

Ap Cec

Ap Cec

AP Elections 2024: తెనాలి, మాచర్ల, అనంతపురంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటలను తీవ్రంగా పరిగణించింది ఎన్నికల కమిషన్‌.. గృహనిర్బంధంతోపాటు కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని ఆదేశించిని ఈసీ.. సాయంత్రం 4 – 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారం ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయటంతో.. కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక, పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా.

Read Also: Delhi: ఢిల్లీలో పోలీస్ వాహనం ఢీకొని ఒకరి మృతి.. కానిస్టేబుల్ అరెస్ట్

Exit mobile version