Site icon NTV Telugu

Pizza Making At Home: డామినోస్ స్టైల్ చికెన్ పిజ్జా ఇంట్లోనే.. ఓవెన్ లేకపోయినా పర్ఫెక్ట్ గా ఇలా చేసేయండి..!

Pizza Making At Home

Pizza Making At Home

Pizza Making At Home: డామినోస్ పిజ్జా అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు కదా.. అయితే వాటిని బయట కొనడం కాకుండా, అదే టేస్ట్‌తో ఇంట్లోనే సులభంగా చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి.. ఏంటి..? డామినోస్ పిజ్జా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా అనే కదా మీ ప్రశ్న.. నిజమేనట బయట తినే పిజ్జా లాగా అచ్చం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూసేయడానికి సిద్ధంగా ఉన్నారా.. ఫ్లఫీ పిజ్జా బేస్, ఇంట్లోనే తయారుచేసే రిచ్ పిజ్జా సాస్, టెండర్‌గా జ్యూసీగా ఉండే చికెన్ టాపింగ్.. ఇవన్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం..

Poco M8 5G Launch: 5,520mah బ్యాటరీ, 50MP కెమెరా.. పోకో ఎం8 5జీ వచ్చేసింది, 7వేల డిస్కౌంట్!

మొదటిగా పిజ్జా బేస్ కోసం డో తయారీ చాలా ముఖ్యం. ముందుగా గోరువెచ్చని నీళ్లలో పంచదార కరిగించి ఇన్‌స్టంట్ ఈస్ట్ వేసి యాక్టివ్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత మైదా పిండి, ఉప్పు వేసుకుని కాస్త లూస్‌గా, లైట్ స్టిక్కీగా ‘డో’ ను కలుపుకోవాలి. ఆయిల్ వేసి బాగా నీట్ చేసిన ‘డో’ను కనీసం గంట నుంచి రెండు గంటల వరకు ఫర్మెంట్ చేయాలి. సరిగ్గా ఫర్మెంట్ అయితే డో మూడు రెట్లు పొంగుతుంది. ఇదే డామినోస్ స్టైల్ ఫ్లఫీ బేస్‌కు రహస్యం.

‘డో’ ఫర్మెంట్ అవుతున్న సమయంలో పిజ్జా సాస్ తయారీ మొదలు పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి వేయించి, టమాటా ప్యూరీ, పంచదార, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో లేదా మిక్స్‌డ్ హర్బ్స్, ఉప్పు, కారం వేసి చిక్కటి సాస్‌గా ఉడికించాలి. ఈ సాస్ పిజ్జాకు స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇక చికెన్ ప్రిపరేషన్ విషయానికి వస్తే.. బోన్ లెస్ చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, నిమ్మరసం, పెరుగు, కసూరి మేతి, కొద్దిగా ఆయిల్‌తో బాగా మారినేట్ చేయాలి. అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచిన తర్వాత పాన్‌లో తక్కువ మంటపై టెండర్‌గా, జ్యూసీగా ఉండేలా ఉడికించాలి.

Bipasha Basu : ఫిట్‌నెస్ అంటే సన్నబడటం కాదు.. బలంగా ఉండటం

ఫర్మెంట్ అయిన ‘డో’ను అవసరమైనంతగా భాగాలుగా చేసుకుని.. ఆ తర్వాత బటర్ అప్లై చేసిన ప్లేట్ లేదా కేక్ టిన్‌లో చేత్తోనే సమానంగా స్ప్రెడ్ చేయాలి. ఫోర్క్‌తో చిన్నగా రంధ్రాలు చేసి పిజ్జా సాస్, మయోనీస్ ను స్ప్రెడ్ చేయాలి. ఆపై మొజరిల్లా చీజ్, కట్ చేసిన వెజిటబుల్స్, చికెన్ టాపింగ్ వేసి మళ్లీ చీజ్ లేయర్ ఇవ్వాలి. ఇకపోతే పిజ్జా ఎడ్జెస్ క్రిస్పీగా రావాలంటే కరిగించిన బటర్ అప్లై చేయాలి.

ఈ పిజ్జాను ఓవెన్‌లో 170–180 డిగ్రీల వద్ద 20–25 నిమిషాలు బేక్ చేయాలి. అవెన్ లేకపోయినా స్టవ్‌పై మీడియం ఫ్లేమ్‌లో అంతే సమయం పాటు బేక్ చేస్తే చాలు. చీజ్ మెల్ట్ అయి పైన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసుకోవాలి. చివరగా చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో స్ప్రెడ్ చేసి కట్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్‌లో ఎలాంటి తేడా ఉండదు. బయట తినే దానికంటే ఫ్రెష్‌గా, హైజీనిక్‌గా ఇంట్లోనే తయారుచేసిన డామినోస్ స్టైల్ చికెన్ పిజ్జా రెడీ.

Exit mobile version