Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tawa Paneer Tikka Recipe: పనీర్ వంటకాల్లో అందరికీ ఆల్-టైమ్ ఫేవరెట్ డిష్ ‘పనీర్ టిక్కా’. రెస్టారెంట్‌కి వెళ్తే వెజిటేరియన్ ఫుడ్స్ లో కచ్చితంగా దీనిని ఆర్డర్ చేస్తుంటారు. అయితే ఎలాంటి తందూరి లేదా ఒవెన్ అవసరం లేకుండా, ఇంట్లో ఉండే పెన్నం పైనే కేవలం 15 నిమిషాల్లో ఎంతో జ్యుసీగా, టేస్టీగా ఉండే పనీర్ టిక్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనితో పాటు కాంబినేషన్‌గా అదిరిపోయే స్పెషల్ గ్రీన్ చట్నీ తయారీ విధానం కూడా చూసేద్దాం.
కావలసిన పదార్థాలు:
* పన్నీర్ – 200 గ్రాములు (క్యూబ్స్ లాగా కట్ చేసినవి)
* గట్టి పెరుగు (Hung Curd) – అర కప్పు
* కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* జీలకర్ర పొడి – అర టీస్పూన్
* గరం మసాలా – 1 టీస్పూన్
* చాట్ మసాలా – అర టీస్పూన్
* కసూరి మేతి – 1 టేబుల్ స్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్
* నిమ్మరసం – 1 స్పూన్
* శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయలు, క్యాప్సికమ్ – ముక్కలుగా కట్ చేసినవి
* నూనె లేదా వెన్న – కాల్చడానికి సరిపడా
* రుచికి సరిపడా ఉప్పు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తయారీ విధానం:
మారినేషన్ ప్రాసెస్:
మొదటగా పెరుగులో నీరు లేకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ఒక కాటన్ బట్టలో పెరుగును వేసి కాసేపు పిండితే గట్టి పెరుగు రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో ఈ గట్టి పెరుగును తీసుకొని అందులో కాశ్మీరీ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో శనగపిండిని వేసి ఉండలు లేకుండా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలపాలి. ఇప్పుడు పనీర్ ముక్కలు, ఉల్లిపాయ క్యూబ్స్, క్యాప్సికమ్ ముక్కలను వేసి సాఫ్ట్‌గా బాగా కోట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
స్పెషల్ గ్రీన్ చట్నీ తయారీ:
ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీలో కొద్దిగా గట్టి పెరుగును కలిపితే హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీ సిద్ధమవుతుంది.
పనీర్ టిక్కా కాల్చే విధానం:
వుడెన్ స్టిక్స్ ఉంటే పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను వరుసగా గుచ్చుకోవాలి. స్టిక్స్ లేకపోతే నేరుగా పెనంపైనే కాల్చుకోవచ్చు. స్టవ్ పై తవా పెట్టి కొద్దిగా ఆయిల్ లేదా బట్టర్ వేసి గ్రీస్ చేయాలి. తవా వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కలను లేదా స్టిక్స్‌ను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే జ్యుసీ రెస్టారెంట్ స్టైల్ తవా ‘పన్నీర్ టిక్కా’ రెడీ. చివరగా కొద్దిగా నిమ్మరసం, చాట్ మసాలా చల్లి స్పెషల్ గ్రీన్ చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!