Coriander Rice Recipe: ఈజీ అండ్ క్విక్ రెసిపీ.. సింపుల్ ఇంగ్రిడియెంట్స్‌తో స్పెషల్ ‘కొత్తిమీర రైస్’ చేసేయండి ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coriander Rice Recipe: ఇంట్లో కూరగాయలు లేకపోయినా, తక్కువ సమయంలోనే రుచికరమైన వంటకం చేయాలనుకుంటే కొత్తిమీర రైస్ బెస్ట్ ఆప్షన్. సులభమైన పదార్థాలతో, చాలా తక్కువ టైమ్‌లో తయారయ్యే ఈ రైస్ పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఈ టేస్టీ ‘కొత్తిమీర రైస్’ ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* కొత్తిమీర – 1 మీడియం కట్ట (కాడలతో సహా)
* బాస్మతి రైస్ – 1 గ్లాసు (అరగంట ముందు నానబెట్టాలి)
* పచ్చిమిర్చి – 4 నుండి 5
* పుదీనా – ఒక గుప్పెడు (ఆప్షనల్)
* ఉల్లిపాయ – 1 పెద్దది (సన్నగా తరిగినది)
* టొమాటో – 1 చిన్నది (సన్నగా తరిగినది)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు
* హోల్ గరం మసాలా – బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు
* నూనె – 1 టేబుల్ స్పూన్
* నెయ్యి – 1 టేబుల్ స్పూన్
* ఉప్పు – రుచికి సరిపడా
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
తయారీ విధానం:
ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా అన్నిటిని కొద్దిగా నీళ్లు వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇవి వంటకు మంచి సువాసన ఇస్తాయి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి.
ఇప్పుడు ముందుగా తయారు చేసిన కొత్తిమీర పేస్ట్, ఉప్పు వేసి బాగా వేయించాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని కుక్ చేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు 1 గ్లాసు బాస్మతి రైస్‌కు 1.5 గ్లాసుల నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ వేసి మెల్లగా కలపాలి.
మూత పెట్టి మొదట 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో, తర్వాత 10 నిమిషాలలో ఫ్లేమ్‌లో ఉడికించాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు మూత తీయకుండా ఉంచాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే, వేడివేడిగా సువాసనలతో కొత్తిమీర రైస్ రెడీ అవుతుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!