NTV Telugu Site icon

East Godavari: మొదటి ఫలితం ఈ నియోజకవర్గందే..

Madhavi Latha

Madhavi Latha

East Godavari: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ గత నెల ముగియగా.. పలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు డీలా పడిపోయారు.. ఇక, ఈ నెల 4వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు… ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అంటూ నేతలతో పాటు సామాన్య ఓటరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.. నన్నయ్య యూనివర్సిటీలో రాజమండ్రి పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను లెక్కించబోతున్నారు. అయితే, కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌటింగ్‌ జరుగుతుందన్నారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత.. 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. అంతేకాదు.. మొదట కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తామని.. చివరగా రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ ఫలితాలు వస్తాయంటున్న కలెక్టర్‌ మాధవీలతతో ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..