Site icon NTV Telugu

High Temperature: వేడెక్కుతున్న భూమి.. ఆగస్టులో 65దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

High Temperature

High Temperature

High Temperature: భూమిపై ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. రోజురోజుకూ వేడి తీవ్రత ఎక్కువ అవుతోంది. ఒక కొత్త పరిశోధన ప్రకారం ప్రపంచంలోని 65 దేశాలలో ఆగస్టు నెలలో భూమి ఉపరితలంపై 13 శాతం మేర రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర దేశాలలో కొంత ఉపశమనం లభించింది. అయితే 1951 నుండి 1980 వరకు సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం1880లో ఉష్ణోగ్రత రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి గత నెల అత్యంత వేడిగా ఉంది. ఆగస్టులో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో భారీ పెరుగుదల కనిపించిందని విశ్లేషణలో వెల్లడైంది.

Read Also:Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?

ఆగస్టు నెలలో జపాన్, ఉత్తర అట్లాంటిక్, ఉత్తర దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రజలు చాలా వేడిని అనుభవించారు. అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ గురువారం నాడు 174 ఏళ్ల వాతావరణ రికార్డులో ఈ ఏడాది ఆగస్టు నెల అత్యంత వేడిగా ఉందని పేర్కొంది. ఆగస్టు 2023 ఆగస్టు 2016 కంటే వెచ్చగా అనిపించింది. ఈ కాలంలో 0.31 డిగ్రీల సెల్సియస్ తేడా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భూమి మిగిలిన 87 శాతం భాగాలు 1951- 1980 మధ్య సగటు ఉష్ణోగ్రతల కంటే హెచ్చుగా ఉన్నాయి. ఆగస్టు నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1850 – 1900 వరకు సగటు ఉష్ణోగ్రత కంటే 1.68 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రపంచానికి పెద్ద ముప్పుగా పరిగణించబడుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా హిమాలయాలు, ఇతర మంచు పర్వతాలు వేగంగా కరిగిపోతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది.

Read Also:NavIC: ఐఫోన్15లో NavIC టెక్నాలజీ.. ఈ ఇస్రో టెక్నాలజీ ఏంటో తెలుసా..?

Exit mobile version