Site icon NTV Telugu

EAMCET Power Problems: హన్మకొండలో ఎంసెట్ విద్యార్ధులకు కరెంట్ కష్టాలు

Eamcet

Eamcet

తెలంగాణలో భారీవర్షాల విద్యార్ధులకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలు నేటితో పాటు ఈనెల 19, 20 తేదీల్లో జరుగుతాయి. విద్యార్థులు మొత్తం 1,72,241 మంది ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్‌ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాగా.. రెండో సెషన్‌ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించ‌నున్నారు. ఎంసెట్‌ పరీక్షల కోసం 108 కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో తెలంగాణలో 89 కాగా, ఏపీలో 19గా ఉన్నాయి.

హన్మకొండలో ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్ధుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ కొరత ఏర్పడింది. దాని ప్రభావంతో ఎంసెట్ పరీక్షలు రాసే విద్యార్థుల అనేక ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్ష బాగా ఆలస్యమైంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో పరీక్ష కరెంట్ లేక ఆలస్యమైంది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా వాటిని రద్దు చేశారు. అయితే.. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించే విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవ‌కాశాలు వున్నాయి. గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో కరెంట్ లేక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది ఎంసెట్ ఎగ్జామ్. జెనరేటర్ ఏర్పాటు చేయకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైంది పరీక్ష. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 నుండి 12 వరకు జరగాల్సిన ఎగ్జామ్ బాగా లేటయింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించనన్న విద్యాశాఖ తర్వాత తన మనసు మార్చుకుంది. గంటన్నర ఆలస్యంగా ఎగ్జామ్ ప్రారంభించారు అధికారులు. మధ్యాహ్నం 1:30 అయిన ఇంకా పూర్తికాలేదు. తర్వాత సెషన్ బాగా ఆలస్యం అయింది. కరెంట్ లేక, కంప్యూటర్స్ పనిచేయక విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ఈ ఆలస్యానికి కారణం అయినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు రోజులు ఎంసెట్ ఎలా జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

Devineni Uma: ఢిల్లీ వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న జగన్.. పోలవరం డబ్బులు తెచ్చుకోలేరా?

Exit mobile version