మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్.. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.సినిమాలో రవితేజ తన ఫర్మార్మెన్స్ తో అదరగొట్టాడు.అలాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించ లేదు .ఈగల్ సినిమా దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైంది.అయితే థియేటర్లలో రాలే మూవీ కేవలం పదిహేను కోట్ల లోపే కలెక్షన్స్ ను రాబట్టింది. లాభాలు వస్తాయని ఆశించిన నిర్మాతలకు ఈగల్ సినిమాతో నష్టాలను మిగిలాయి.ఈగల్ సినిమాలో క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు .అలాగే నవదీప్ కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే ఈగల్ మూవీ తెలుగులో రిలీజైన రెండు నెలల తర్వాత తమిళంలో రిలీజ్ అయింది.అది కూడా ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. గురువారం(ఏప్రిల్ 18 ) నుంచి ఈగల్ తమిళ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో ఈగల్ తమిళ వెర్షన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో తమిళ వెర్షన్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు.బాలీవుడ్‌లో సూపర్ ఫిట్ అయిన రైడ్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోన్నఈ సినిమా తెరకెక్కుతుంది . గతంలో రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలొచ్చాయి. మళ్ళీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ “మిస్టర్ బచ్చన్ “.ఈ సినిమాతో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.త్వరలోనే రవితేజ మరికొన్ని సినిమాలను ప్రకటించే అవకాశం వుంది .