NTV Telugu Site icon

Chiranjeevi : ‘పరువు’ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. మెగాస్టార్ కామెంట్స్ వైరల్..

Paruvu

Paruvu

Chiranjeevi : టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ZEE5 ఒరిజినల్ వెబ్ సిరీస్ “పరువు”.ఈ సిరీస్ ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు.ఈ సిరీస్ ను సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించారు.ఈ సిరీస్ లో నాగబాబు, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.”పరువు” సీజన్ 1 జూన్ 14 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.ఎంతో ఆసక్తి కలిగిస్తున్నఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.సీజన్ 1 కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సీజన్ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి రాబోతున్న మరో పవర్ ప్యాక్డ్ ట్రైలర్..?

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పరువు వెబ్ సిరీస్‌ను చూసి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు. ఈ సిరీస్ ను తెరకెక్కించిన టీం అందరిని చిరంజీవి ప్రశంసించారు.”పరువు” వంటి అద్భుతమైన కంటెంట్ వున్నా సిరీస్ ను నిర్మించిన సుష్మిత కొణిదెల చూస్తుంటే గర్వంగా ఉందని,అలాగే తమ్ముడు నాగబాబు ఈ సిరీస్ లో అద్భుతంగా నటించారని చిరంజీవి మెచ్చుకున్నారు .ఒక చక్కటి ప్లాన్ తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరికి ఈ జంట తప్పించుకుందా లేదా అని సీజన్ 2 లోనే చూడాలనుకుంటా!.. అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Show comments