NTV Telugu Site icon

Dwayne Bravo Six: డ్వేన్‌ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!

Dwayne Bravo Six

Dwayne Bravo Six

Texas Super Kings Batter Dwayne Bravo Hits Biggest Six in MLC 2023 vs Washington Freedom: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. నాలుగు పదుల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెబుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే బ్రావో ఓ భారీ సిక్సర్ బాదాడు. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మేజర్ లీగ్ క్రికెట్‌ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్‌కు డ్వేన్ బ్రావో ఆడుతున్నాడు. ఈ లీగ్లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రావో అజేయ హాఫ్ సెంచరీ (76; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ మాజీ ప్లేయర్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. అది మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ సిక్సర్‌గా నిలిచిపోయింది.

Also Read: IND Playing XI WI: విరాట్ కోహ్లీ ఔట్.. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టిదే!

ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు పేసర్, దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జ్ వేశాడు. ఈ ఓవర్ రెండో బంతిని నోర్జ్ షార్ట్ పిచ్ బాల్‌గా సాధించగా.. బ్రావో తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్‌గా మలిచాడు. లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి ఏకంగా స్టేడియం బయటపడింది. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు.ఈ భారీ సిక్సర్‌‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ బ్రావో ఆటలు ఫిదా అవుతున్నారు.

వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 164 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. డ్వేన్‌ బ్రావో మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మథ్యూ షార్ట్‌ (80) భారీ హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌కు అజిత్‌ అగర్కార్‌.. ఎవరి కోసం?

Show comments