Site icon NTV Telugu

Hyderabad: అనుమతిలేని లిక్కర్ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. పోలీసుల ఎంట్రీతో..

Duvvada

Duvvada

Hyderabad: దువ్వాడ మాధురి, శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్థసారథి అనే వ్యక్తి అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించారు. అతడి పుట్టినరోజు సందర్భంగా రాత్రి The pendent ఫామ్ హౌస్‌లో పార్టీ ఎరేంజ్ వేశాడు. ఈ పార్టీ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ & మాధురిలను పార్థసారథి ఆహ్వానించారు. మొయినాబాద్ లోని The Pendent ఫామ్ హౌస్ లో బర్దీప్ డే పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. బర్త్‌ పార్టీలో 10 మద్యం బాటిళ్లు 5 హుక్కా పాట్స్ స్వాధీనం చేసుకున్నారు. రియాజ్ అనే వ్యక్తి హుక్కా సప్లై చేశాడు. అనుమతి లేని లిక్కర్ బర్త్ డే పార్టీలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించిన పార్థసారథిని సైతం ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి, పార్థసాథీలను విచారించి నోటీసులిచ్చి పంపించారు మొయినాబాద్ పోలీసులు..

READ MORE: Couple Divorces :భార్య భర్తలు విడిపోవడానికి కారణమైన ఉల్లి, వెల్లుల్లి.. ఎక్కడో తెలుసా..

 

Exit mobile version