Site icon NTV Telugu

Sperm Donation: 550మందిని పుట్టించావు.. ఇక ఆపు.. కోర్టు వార్నింగ్

New Project (6)

New Project (6)

Sperm Donation: వివిధ దేశాల్లో కనీసం 550 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్‌గా మారిన వ్యక్తి ఇకపై స్పెర్మ్‌(వీర్యం)ను దానం చేయకుండా నెదర్లాండ్స్‌లోని కోర్టు నిషేధించింది. ఈ మేరకు శుక్రవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన వీర్యదానం ద్వారా నెదర్లాండ్స్‌లో 550 మందికి పైగా తండ్రినయ్యానని చెప్పుకొంటూ మరింత మందిని అలా చేసేలా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆ వ్యక్తిపై ఆరోపణలున్నాయి. ఆ వీర్యదాత ద్వారా ఓ బిడ్డకు తల్లయిన ఓ మహిళ, ఇతర తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఫౌండేషన్ ఫిర్యాదు మేరకు హేగ్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా ‘ఇవా’గా మాత్రమే ఫౌండేషన్ గుర్తించిన ఆ మహిళ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇతర దేశాలకు చమురు మడ్డిలా వ్యాపిస్తున్న సామూహిక వీర్యదానంపై నిషేధానికిఈ తీర్పు దారి తీస్తుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read Also: Nora Fatehi: నోరా నువ్వు డ్రస్‌ వేసుకున్నావా? అలా చూపిస్తే ఎలా?

డచ్ మార్గదర్శకాల ప్రకారం స్పెర్మ్(వీర్యం) దానం చేసేవారు 12 మంది తల్లులకు మాత్రమే అందివ్వాలి. తద్వారా గరిష్ఠంగా 25 మందిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఈ వీర్యదాత పిల్లలు కావాలనుకునే తల్లిదండులకు అబద్ధాలు చెప్పాడని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే తాను డచ్‌లోని అనేక ఫర్టిలిటీ సెంటర్లకు వీర్యాన్ని దానం చేశానని, అలాగే డెన్మార్క్‌లో ఒక క్లినిక్‌తో పాటుగా ప్రకటనల ద్వారా తనకు పరిచయమైన చాలా మందికి వీర్యదానం చేశానని జొనాథన్ ఎం చెప్పుకొన్నాడని కోర్టు ఓ లిఖిత తీర్పులో పేర్కొంది. అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి గర్భధారణ చేయలేకపోయిన వారిని మోసగించడానికి ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది. ఇకపై వీర్యదానాన్ని నిలిపివేయాలని, ఒక వేళ ఈ నిషేధాన్ని ఉల్లంఘించి వీర్యదానాన్ని కొనసాగించినట్లయితే ఒక్కో కేసుకు లక్ష యూరోలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Read Also:Kamal Haasan: కర్నాటక ఎన్నికల్లో కమల్‌హాసన్‌ ప్రచారం?!

Exit mobile version