Site icon NTV Telugu

Dussehra 2025: దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచిదా? అసలు మ్యాటరేంటంటే..

Dussehra Palapitta

Dussehra Palapitta

Dussehra 2025: దసరా లేదా విజయదశమి పండుగ.. తెలుగు ప్రజల జీవితంలో ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో తెలంగాణలో బతుకమ్మగా, ఆంధ్రప్రదేశ్‌లో దేవీ నవరాత్రులుగా వేడుకలు జరుపుకున్నప్పటికీ.. దసరా రోజున చేసే ముఖ్యమైన ఆచారలలో ‘పాలపిట్ట’ను చూడటం, జిమ్మి చెట్టు దర్శనం ముఖ్యమైనవి. ఇకపోతే ఈ పాలపిట్ట దర్శనాన్ని ప్రజలు అత్యంత శుభప్రదంగా, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నమ్మకానికే గౌరవం ఇస్తూ ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా పెట్టుకున్నారు.

కొత్త బ్రేకింగ్ సిస్టమ్, డిజైన్ అప్‌గ్రేడ్లతో వచ్చేసిన 2025 TVS Raider 125

విజయదశమి రోజున పాలపిట్ట కనిపిస్తే ఆ ఏడాది అంతా శుభమే జరుగుతుందని ప్రజల విశ్వాసం. ఈ ఆచారం వెనుక రెండు ఆసక్తికరమైన పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటంటే.. మొదటి కథలో.. మహాభారతంలో, పాండవులు తమ అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న రోజు విజయదశమి. వారు తిరిగి వస్తుండగా దారిలో వారికి పాలపిట్ట కనిపించిందట. ఆ పక్షి దర్శనం తమకు విజయాన్ని, మంచి భవిష్యత్తును సూచిస్తుందని వారు నమ్ముకున్నారు. ఆ నమ్మకంతోనే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. అందుకే, విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే తప్పకుండా విజయం వరిస్తుందని అప్పటి నుంచి ఇది ఒక ఆచారంగా మారిందని చెబుతారు.

AUS vs NZ: సిక్సర్లతో చెలరేగిన మిచెల్ మార్ష్.. కివీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..

ఇక మరో పురాణ కథ ప్రకారం.. శ్రీరాముడు రావణుడితో యుద్ధానికి బయలుదేరే ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నారని ప్రతీతి. ఈ దర్శనంతో యుద్ధంలో రాముడు విజయం సాధించాడు. అందుకే, దసరా రోజున ఈ పక్షిని చూస్తే తాము చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక గ్రామాల్లోని ప్రజలు దసరా రోజున పాలపిట్టను చూడటానికి పొలాల వైపు వెళ్ళే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే నగరాల్లో ఈ పక్షిని చూడటం కష్టమైంది. మొత్తంగా విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున జమ్మిచెట్టు దర్శనంతో పాటు, పాలపిట్టను చూడటం కూడా ఆ విజయాన్ని, శుభాలను తమ జీవితంలోకి ఆహ్వానించినట్లుగా ప్రజలు భావిస్తారు. అందుకే దసరా పండుగలో వీటికి అంతటి ప్రాముఖ్యత లభించింది.

Exit mobile version