Dussehra 2025: విజయదశమి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో రావణ దహన వేడుకలకు వర్షం అంతరాయం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఢిల్లీ, పాట్నా, జౌన్‌పూర్‌తో సహా అనేక నగరాల్లో ఆకస్మిక వర్షాలు మైదానంలో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మలను తడిపేశాయి. నోయిడాలోని రాంలీలా మైదానంలో భారీ వర్షం ప్రారంభమవడంతో రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలు నీటితో తడిసిపోయాయి. దిష్టిబొమ్మలను చూడటానికి చాలా మంది జనాలు వచ్చారు. కానీ వర్షం వారు మైదానం వదిలి ఇంటికి వెళ్లిపోయారు.
READ MORE: Ind vs WI: తొలి రోజు ముగిసిన ఆట.. రాహుల్ అర్ధ సెంచరీ.. భారత్ స్కోరు ఎంతంటే..?
ఢిల్లీ ఇంద్రప్రస్థలోని రాంలీలా మైదానంలో కురిసిన భారీ వర్షం పండుగ ఉత్సాహాన్ని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకముందే భారీ వర్షం ప్రారంభమైంది. దహనానికి ఏర్పాటు చేసిన రావణుడి కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మలు, ఉగ్రవాదాన్ని సూచించే వారి దిష్టిబొమ్మలు తడిసిపోయాయి. దిష్టిబొమ్మలు తడిసిపోకుండా నిర్వాహకులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వరుణుడు తడిపేశాడు. మరోవైపు.. ఢిల్లీలోని లవ్-కుష్ రాంలీలా మైదానంలో భారీ వర్షం కుస్తోంది. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లా షాగంజ్‌లోని రాంలీలా మైదానంలో భారీ వర్షం మధ్య రావణుడి దిష్టిబొమ్మ దహనం జరిగింది. వర్షం కారణంగా దిష్టిబొమ్మ కూలిపోయింది. అయినప్పటికీ.. నిర్వాహకులు దానిని తగలబెట్టారు. ప్రేక్షకులు గొడుగులు పట్టుకుని మరీ వర్షంలో నిలబడి రావణ దహనాన్ని వీక్షించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో రావణ దహనం కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. బాణసంచాతో అలంకరించిన రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి భారీ దిష్టిబొమ్మలు పూర్తిగా తడిసిపోయాయి. భారీ వర్షం కారణంగా.. రావణుడి బొమ్మ తల విరిగిపోయింది.
READ MORE: Garba Dance : చీరలు ధరించి గర్బా చేసిన పురుషులు.. అసలు విషయం ఇదే..!
