NTV Telugu Site icon

Dunki : డంకీ టీజర్‌పై అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్..

Whatsapp Image 2023 10 30 At 8.34.54 Pm

Whatsapp Image 2023 10 30 At 8.34.54 Pm

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్‌ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్న ఈ చిత్రం లో ఢిల్లీ భామ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తుంది..తాజాగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ డంకీ టీజర్‌ కు సంబంధించి మూవీ లవర్స్‌ కు అదిరిపోయే అప్‌డేట్ ను అందించాడు.

సలార్‌ ట్రైలర్‌ గురించి ఎందుకు అప్‌డేట్ చేయలేదని అందరూ నన్ను అడుగుతున్నారు… కానీ నేను అప్‌డేట్‌ చేయలేను.. షారుఖ్‌ ఖాన్‌ సార్‌ కి కాల్ చేశా. తన పుట్టినరోజున టీజర్‌  వస్తుందని చెప్పారు. డంకీ టీజర్‌ 56 సెకన్లు ఉంటుంది. నేను నా టీజర్‌ ని అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు సలార్ ట్రైలర్‌ని అప్‌లోడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది సలార్‌ వర్సెస్ డంకీ కాదు.. సలార్-డంకీ.. అని షారుఖ్‌ ఖాన్‌ చెప్పారని ట్వీట్ చేశాడు ప్రశాంత్‌ నీల్‌.అంటే డంకీ టీజర్‌ విడుదలయ్యాక సలార్ ట్రైలర్ వస్తుందని ప్రశాంత్ నీల్ తెలియజేశారు.. మొత్తానికి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ అందించి అటు షారుఖ్ ఫ్యాన్స్‌, ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్ కు మంచి శుభ వార్త అందించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. డంకీ సినిమాను రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తం గా డంకీ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 21న గ్రాండ్‌గా థియేటర్ లలో విడుదల కానుంది.మరి డంకీ సినిమా తో షారుఖ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి..

https://twitter.com/parshantneel/status/1718963564940320847?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1718963564940320847%7Ctwgr%5Ef1ed0237c656366fd94d76f29052d7e6e1d26ada%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F