NTV Telugu Site icon

Dummy Currency Gang: డమ్మీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్

డమ్మీ కరెన్సీ కాగితాలతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 26.8లక్షల విలువగల నకిలీ 2వేల నోట్లతో పాటు వివిధ రకాల రసాయనక ద్రావణాలు, స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రైస్ పుల్లింగ్ కి వినియోగించే రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లును నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు వరంగల్ పోలీసులు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్, వర్ధన్నపేట పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలపై దాడులు చేశారు. ఎనిమిది మంది సభ్యుల ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. అదనపు సంపాదన కోసం మోసాలకు సిద్ధపడ్డారు 8 మంది సభ్యులు. నకిలీ నోట్ల దందాతో పాటు రైస్ పుల్లింగ్ కి ప్లాన్ చేశారు. అందులో భాగంగా 50 వేల అసలు నోట్లకు మూడురెట్ల నకిలీ నోట్లను ఇచ్చేలా ఒప్పందం చేసుకొని పోలీసుల నకిలీ నోట్లు పట్టు పడకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.

ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు రెండువేల రూపాయల నకిలీ నోట్లను నలుపు కాగితాలుగా మార్చి, వాటిని తిరిగి నలుపు రంగులో వున్న కాగితాలను రసాయన ద్రావణంతో శుభ్రం చేయడంతో తిరిగి నలుపు కాగితాలు 2వేల నకిలీ నోట్లుగా మార్చే ప్రక్రియను వీడియో తీశారు నిందితులు.

దీని ఆధారంగా నకిలీ నోట్లను ఇచ్చేందుకు నగరంలో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 8 మంది ముఠా లోని నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా ముమ్మాడి ధనుంజయ్ ఆలియాస్ శివ వనపర్తి జిల్లా, గుట్టా హరిప్రసాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, గడ్డం నాగరాజు ఇల్లందు గ్రామం, వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, చల్లా మహేష్, గొర్రెకుంట వరంగల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజు వర్ధన్నపేట, అశోక్ పెద్దమ్మగడ్డ, కిషన్ కామారెడ్డి, సతీష్ మహబూబాబాద్‌కు చెందిన వారు పరారీలో ఉన్నారు.

Read Also: Unstoppable: చిరంజీవి ‘అన్ స్టాబుల్’ షో కు రాకపోడానికి కారణం అదే!

ఈ ముఠా సభ్యులు నకిలీ నోట్ల చలామణితో పాటు. అతీంద్రీయ శక్తులు ఉన్న పాత్రల్ని అమ్మేదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. రైస్ పుల్లింగ్ కోసం వాడే రాగి పాత్రలు, గోపురం కలశాలు, రాగి నాణేలను వివిధ రసాయలతో పురాతన వస్తువులుగా మార్చి అమ్మకాలు చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలను పోలీసులు రట్టుచేశారు. వారి దగ్గర నుండి. రెండు రాగి కలశాలు, ఒక రాగి జగ్గు, ఒక కత్తి, రాగి నాణేం, బ్యాటరీలు, టార్చిలైట్లు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనంచేసుకున్నారు. సామాన్యులు మోసపోకుండా ముందే మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసిన వర్ధన్నపేట సీఐ సదన్ కుమార్ తో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులను వరంగల్ సీపీ అభినందించారు.