NTV Telugu Site icon

Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ

New Project (18)

New Project (18)

Dulkar Salman : మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగు సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయనకు తెలుగు నుంచి కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు వస్తున్నప్పటికీ కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. అతను ఎలాంటి సినిమా ఓకే చేసినా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్పట్లో సీతారామం సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్నాడు దుల్కర్. ఆయన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్ తో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక ఆ విజయాన్ని ఆస్వాదించుకుంటూ, మరొక ఆసక్తికర ప్రాజెక్ట్‌తో మరోసారి రాబోతున్నాడు. ఈసారి ఆయన అందాల నటి పూజా హెగ్డేతో కలిసి వెండితెరకు పంచుకోబోతున్నాడు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. దసరా వంటి హిట్ సినిమాలను నిర్మించిన ఈ స్టూడియో ప్రస్తుతం ది ప్యారడైస్ సినిమా నిర్మాణపనుల్లో ఉంది.

Read Also:Morning Walk: అధిక కాలుష్యం ఉన్నా మార్నింగ్ వాక్ కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరనే విషయంలో అనేక రకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈసారి కూడా దుల్కర్ సల్మాన్ మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అందులోనూ కొత్త దర్శకుడు కావడంతో అతను కంటెంట్ పై ఎంత నమ్మకం ఉంచాడో అర్థం అవుతుంది. ఆ డెబ్యూ డైరెక్టర్ పేరే రవి. గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోబోతున్నాడు. దుల్కర్ పూజా హెగ్డే జంట తొలిసారి తెరపై కనిపించబోతుండడంతో ఈ ప్రాజెక్ట్‌ పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11న మొదలుకానున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. డిసెంబర్ మొదటి వారం స్క్రీన్ టెస్టింగ్ జరిపిన తర్వాత రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. క్యూట్ ప్రేమకథతో పాటు వినూత్న కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్న నమ్మకంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు.

Read Also:Saudi Arabia: ఏడాదిలో 300 మందికి పైగా మరణశిక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా..

Show comments