Rishabh Pant heard plans of the opposing team in Duleep Troph 2024: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా-బి శుభారంభం చేసింది. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా-ఎ 53 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ అయింది. కేఎల్ రాహుల్ (57; 121 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. ఇండియా-బి విజయంలో పేసర్లు ముకేశ్ (2/50), దయాళ్ (3/50), సైనీ (2/41) కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ (61; 47 బంతుల్లో 9×4, 2×6) దూకుడుగా ఆడడంతో ఇండియా-బి పోరాడే స్కోర్ చేసింది.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆట చివరి రోజైన ఆదివారం ఆట ప్రారంభానికి ముందు ప్రత్యర్థి జట్టు ఇండియా-ఏ టీమ్ మైదానంలో హడల్ (మీటింగ్) నిర్వహించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆటగాళ్లకు గేమ్ ప్లాన్స్ వివరించాడు. ఆ సమయంలో పంత్ ప్రత్యర్థి టీమ్ మీటింగ్‌లోనే ఉండి.. వారి ప్లాన్స్ అన్నీ వినేశాడు. హడల్ అనంతరం ఆటగాళ్లంతా ఫీల్డింగ్ చేసేందుకు వెళుతుండగా.. పంత్ డగౌట్‌కు బయల్దేరాడు.
Also Read: Paralympics 2024 India: పారాలింపిక్స్‌లో రికార్డు పతకాలు.. భారత్ విజేతల లిస్ట్ ఇదే!
తమ టీమ్ మీటింగ్‌లో రిషబ్ పంత్‌ను చూసిన ఇండియా-ఏ జట్టు పేసర్ అవేశ్ ఖాన్ షాక్ అయ్యాడు. ఏంటి నువ్ ఇక్కడున్నావ్? అని అడగగా.. పంత్ నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘పంత్.. చిలిపి పనులు మళ్లీ మొదలెట్టేశాడురో’, ‘ఇన్నిం రోజులు ఈ ఫన్ చాలా మిస్ అయ్యాం పంత్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రత్యర్థి టీమ్ మీటింగ్‌లో నువ్వెంటి అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు.
Look who was there in the India A huddle before the start of the day’s play 😃 #DuleepTrophy| @IDFCFIRSTBank
Follow the match 🔽 https://t.co/Oke5l0BJpq pic.twitter.com/MxL8Pv05dV
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024