Site icon NTV Telugu

2025 Ducati Multistrada V2: మార్కెట్ లోకి డుకాటి 2025 మల్టీస్ట్రాడా V2.. దీని ధరకు ఓ ప్లాట్ కొనొచ్చు బ్రో

Ducati

Ducati

డుకాటి భారత మార్కెట్లో 2025 మల్టీస్ట్రాడా V2 అనే కొత్త బైక్ ను విడుదల చేశారు. ఇది మిడ్-సైజ్ అడ్వెంచర్ టూరింగ్ విభాగంలో ఉంది. డుకాటి 2025 మల్టీస్ట్రాడా V2 890cc ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 115 హార్స్‌పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 19-లీటర్ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. ఇది స్టార్మ్ గ్రీన్, డుకాటి రెడ్ కలర్ స్కీమ్, అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇది 17-, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్రెంబో బ్రేక్‌లు, పిరెల్లి టైర్లు, ABS, DTC, DWC, DQS, EBC, ఐదు-అంగుళాల స్క్రీన్, స్పోర్ట్, టూరింగ్, అర్బన్, ఎండ్యూరో, వెట్ రైడింగ్ మోడ్‌లు, హై, మిడ్, లో, ఆఫ్-రోడ్ పవర్ మోడ్‌లు, LED హెడ్‌లైట్‌లు, LED DRLలు, కమింగ్-హోమ్ ఫీచర్, క్రూయిజ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది.

Also Read:Cyclone Montha: విజయవాడకు మొంథా తుఫాన్‌ ముప్పు.. రోడ్లపైకి రావద్దు..! నగరవాసులకు వీఎంసీ వార్నింగ్

ముందు 48 మి.మీ. USD ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. రెండూ పూర్తిగా అడ్జస్టబుల్. బ్రెంబో M4.32 కాలిపర్స్‌తో 320 మి.మీ. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ముందు, 265 మి.మీ. సింగిల్ డిస్క్ వెనుక ఉన్నాయి. కంపెనీ భారత్ లో ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 18.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేయగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 21.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Exit mobile version