NTV Telugu Site icon

Dubbapally Villagers Protest: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంగతేంటి? దుబ్బపల్లి వాసుల ఆందోళన

Ktpp1

Ktpp1

తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుబ్బపల్లి వాసులు ఆందోళన బాటపట్టారు. కేటీపీపీ పర్యటనకు వచ్చిన జెన్కో ఎండీకి ఈ నిరసన సెగ తగిలింది. గణపురం మండలం చెల్పూరు వద్ద గల కేటీపీపీ రెండవ గేటు వద్ద దుబ్బపల్లి గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితులతో మాట్లాడతానని హామీ ఇచ్చి మరో గెట్ నుండి వెళ్లిపోయారు టీఎస్ జెన్కో సీఎండి ప్రభాకర్ రావు. గ్రామస్తుల ఆందోళనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Read Also:
VK Sasikala: జయలలిత మరణంలో నా పాత్ర లేదు.. విచారణ ఎదుర్కోవడానికి సిద్ధం

కెటిపిపి పరిశీలనకు వచ్చి మధ్యలోనే వెనుదిరిగి వెళ్లిపోయారు సీఎండీ ప్రభాకర్ రావు. గేటు దగ్గర బైఠాయించి ఆందోళన ఉదృతం చేశారు గ్రామస్తులు. వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని,గ్రామాన్నీ మరో చోటుకి తరలించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కేటీపీపీ రెండవ గేటు ముందు ఆందోళన చేస్తున్న దుబ్బపల్లి గ్రామస్తులను అరెస్టు చేసి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Read Also: Physical Harassment: ప్రైవేట్ స్కూళ్ళో LKG విద్యార్థినికి వేధింపులు.. కీచక డ్రైవర్ అరెస్ట్