NTV Telugu Site icon

Dubai Seenu Re Release: మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతున్న దుబాయ్ శీను.. ఎప్పుడంటే?

Dubai Seenu

Dubai Seenu

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలు ఒక్కొక్కటి రీ రిలీజ్ అవుతున్నాయి.. కిక్ సినిమా కూడా మళ్లీ రిలీజ్ కాబోతుంది.. ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది.. రవితేజ దర్శకుడు శ్రీను వైట్లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.. గత ఏడాది ఆఖరిలో ‘వెంకీ’ రీ రిలీజ్ చేయగా… భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా ‘దుబాయ్ శ్రీను’ రీ రిలీజ్ కోసం థియేటర్స్ సిద్ధం అవుతున్నాయి..

ఈ సినిమాను ఫిబ్రవరి 24, 25న రెండు తెలుగు రాష్ట్రాలు… ఏపీ, తెలంగాణలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నట్టీస్ ఎంటర్టైన్మెంట్ అధినేత, ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాలో రవితేజ సరసన నయనతార జోడిగా నటించింది.. విలన్ గా సుశాంత్ సింగ్ నటించగా… బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, నేహా బాంబ్, భాను చందర్, షాయాజీ షిండే, రఘుబాబు, సుప్రీత్, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు..

రవితేజ సినిమాల విషయానికొస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ చేస్తున్నారు. హిందీ హిట్ ‘రైడ్’కు రీమేక్ ఇది. అయితే… తెలుగుకు తగ్గట్టు హరీష్ శంకర్ పలు మార్పులు చేశారట. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఈగల్’ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.. ఇకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో రెండు మూడు సినిమాలు చేయడానికి అవుతున్నారు.. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ఆలోచిస్తున్నారు..

Show comments