ఇటీవల శంకర్ పల్లిలో ఓ యువతి రైల్వే ట్రాక్ పై కారు నడిపి హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేయడంతో రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఆటోను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. బీహార్‌లోని సీతామర్హి-దర్భంగా రైల్వే సెక్షన్‌లోని మెహసౌల్ గుమ్టి సమీపంలో లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది.
Also Read:PM Narendra Modi: బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోడీ.. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరకానున్నారు
ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై తన ఆటోను నడిపాడు. ఆ సమయంలో ఎదురుగా రైలు దూసుకొస్తోంది. ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపాడు. దీని కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే, GRP పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
Also Read:Raviteja : రవితేజ లైఫ్ ఇస్తే.. వాళ్లు పట్టించుకోవట్లేదా..?
రైల్వే ట్రాక్ పై ఒక ఆటో నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది దాని వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో రైలు హారన్ మోగిస్తోంది. లోకో పైలట్ ఆటోను చూడగానే బ్రేక్ వేయడంతో రైలు ఆగిపోయింది. ఆ వ్యక్తి మద్యం తాగి రైల్వే ట్రాక్ పై ఆటో నడపడం ప్రారంభించాడని స్థానికులు తెలిపారు. రైల్వే ట్రాక్ పై ఆటో నడుపుతున్న డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు సంఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ తెలిపారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
