Drishyam 3 : చిక్కుల్లో మోహన్ లాల్-జీతూ జోసెఫ్ దృశ్యం – 3.. రిలీజ్ డౌట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ వెండితెరపై సంచలనం సృష్టించిన ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చట్టపరమైన చిక్కుల్లో పడటం ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాను నిర్మిస్తున్న ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ గతంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న డిజిటల్ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, డిజిటల్ సంస్థకు అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది. మే 15వ తేదీ వరకు ‘దృశ్యం 3’ సినిమాకు సంబంధించి ఎలాంటి కొత్త డీల్స్ OTT లేదా ఇతర డిజిటల్ హక్కులు కుదుర్చుకోకూడదని నిర్మాతలకు స్టే ఆర్డర్ జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామంతో చిత్ర యూనిట్ డైలమాలో పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 21న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో సమస్య త్వరగా కొలిక్కి రాకపోతే మే 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అటు మోహన్ లాల్ అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!