Site icon NTV Telugu

DRDO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఆర్డీఓ లో 204 ఉద్యోగాలు..

Drdo

Drdo

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా రక్షణ శాఖకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వింగ్ డీఆర్‌డీవో, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేపడుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 204 ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది..అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది..పూర్తి వివరాలు..

ఖాళీ పోస్టులు 204. విభాగాల వారీగా ఇలా..

డీఆర్డీఓ మెయిన్ 181
డీఎస్టీ విభాగం 11
ఏడీఏ 06
సీఎంఈ విభాగం 06

అర్హతలు..

దరఖాస్తుదారులు సంబంధిత ఫీల్డ్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. ఈ సమాచారాన్ని అప్లికేషన్ ఫారమ్‌లో తప్పనిసరిగా తెలియజేయాలి..
వయసు..

అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను అభ్యర్థులకు ప్రత్యేక కాల్ లెటర్‌ ద్వారా వివరాలను తెలుపుతారు..

జీతం..

డీఆర్‌డీవో సైంటిస్ట్-బి రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56,100 నుంచి 1,77,500 మధ్య ఉంటుంది…

ఎలా అప్లై చెయ్యాలంటే?

ముందుగా డీఆర్‌డీవో అధికారిక పోర్టల్ www.drdo.gov.inను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోకి వెళ్లి అడ్వటైజ్‌మెంట్ నంబర్ 145 క్లిక్ చేసి సైంటిస్ట్-బి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అనంతరం రిజిస్టర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
అన్ని వివరాలను అందులో ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి..
అవసరమైన డాక్యూమెంట్స్ ను అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.. నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవడం మంచిది..

Exit mobile version