Site icon NTV Telugu

Dr Care Summer Health Camp: వేసవిలో ఊరట.. డా.కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్

Summer Health Camp

Summer Health Camp

Dr Care Summer Health Camps In All Dr Care Branches: వేసవి అనగానే సెలవులు, సంతోషం, దానితో పాటుగా పలు రకాల రోగాల ప్రభంజనం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగాల బారి నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు డా. కేర్ గ్రూప్ సీఎండీ, డా. ఏఎమ్ రెడ్డి ‘డా. కేర్ సమ్మర్ హెల్త్ క్యాంప్’ను ప్రారంభించారు. ప్రతి డా. కేర్ బ్రాంచ్‌లో ఈ క్యాంప్‌లు నిర్వహించబడతాయని తెలిపారు. ఎండ తీవ్రతను తట్టుకుంటూ పలు రకాల రోగాల బారిన పడకుండా ఉండేలా డా. కేర్ వారు అందిస్తున్న ఈ సేవలకు అందరూ ఉపయోగించుకోవాలని డా. ఏఎమ్ రెడ్డి సూచించారు.

వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఫ్లూ జ్వరాలు, వాంతులు, విరోచనాలు, కండ్ల కలకలు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, సన్ బర్న్, యూరినరీ ట్రీట్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి, తలనొప్పి, థైరాయిడ్, రెనాల కొలైటిస్, కిడ్నీ రాళ్లు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, చికెన్ పాక్స్, అలర్జీస్ మొదలైన వ్యాధులకు తగిన చికిత్సలు ఈ సమ్మర్ హెల్త్ క్యాంప్ ద్వారా పొందవచ్చు. ఈ రోగాలకు ముందు జాగ్రత్తగా ‘సమ్మర్ ఇమ్యూనిటీ బూస్టర్’ను డా. కేర్ వారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా డా. ఏఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డా. కేర్ సమ్మర్ ఇమ్యూనిటీ బూస్టర్‌తో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. మార్చి 10వ తారీఖు నుంచి ఈ సేవలు డా. కేర్ అన్ని బ్రాంచ్‌లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

Exit mobile version