Site icon NTV Telugu

Double Ismart : డబుల్ ఇస్మార్ట్ ‘మ్యూజిక్ జాతర’ లోడింగ్..

Double Ismart

Double Ismart

Double Ismart :ఉస్తాద్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీకి డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో పూరి జగన్నాధ్ లైగర్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. లైగర్ సినిమాతో దర్శకుడు పూరీజగన్నాధ్ భారీగా నష్టపోయారు. లైగర్ సినిమా ప్లాప్ తో ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు స్టార్స్ ఎవ్వరూ కూడా దైర్యం చేయలేదు.లైగర్ సినిమా విడుదల అవ్వక ముందే పూరీజగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో మొదలు పెట్టాడు.

Read Also : Kalki 2898 AD : ప్రభాస్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే..?

లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో జనగణమన తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీనితో ఈ సినిమా ఆగిపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైం లో హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేయగా ఆ సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డబుల్ ఇస్మార్ట్ మూవీ మొదలైంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను దర్శకుడు పూరీజగన్నాధ్ ,ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  యంగ్ బ్యూటీ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.  మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.ప్రమోషన్ లో భాగంగా డబుల్ ఇస్మార్ట్  నుంచి ఊర మాస్ పటాక సాంగ్ రెడీ అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.త్వరలోనే మ్యూజిక్ జాతర లోడింగ్ అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు.

Exit mobile version