NTV Telugu Site icon

Donald Trump: మీరు గ్రాడ్యుయేట్‌ అయితే నేరుగా గ్రీన్‌ కార్డు ఇచ్చేస్తాం..

Trump

Trump

Donald Trump: యూఎస్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ పూర్తైన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్ కార్డు ఇవ్వాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలు ఏంటి అని ఎదురైన క్వశ్చన్ కు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై ప్రతిసారి విమర్శలు కురిపించే ఆయన నోటి నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: AP Assembly Speaker: శాసనసభ స్పీకర్‌ ఎన్నిక.. అయ్యన్నపాత్రుడు తరపున పవన్‌, లోకేష్‌ నామినేషన్‌

ఇక, తాను అధికారంలోకి వస్తే.. కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డును ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అది రెండు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు, ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదన్నారు. జూనియర్ కళాశాలకు కూడా దీన్ని వర్తింపజేయాలని చూస్తున్నట్లు మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇక, తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే దీనిపై నజర్ పెడతాను అని చెప్పుకొచ్చారు. అలాగే, కోవిడ్-19 వల్ల గతంలో దీన్ని అమలు చేయలేకపోయమని వెల్లడించారు. వీసా సమస్యల కారణంగా భారత్, చైనా లాంటి దఏశాల నుంచి వస్తున్న చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నారు.. వారందరూ సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Read Also: Kalki 2898 AD : మూడు ప్రపంచాల చుట్టూ కల్కి కథ.. స్పెషల్ పోస్టర్స్ వైరల్..

అయితే, రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలోకి డొనాల్డ్ ట్రంప్ దిగారు. సాధారణంగా ప్రచార కార్యక్రమాల్లో విదేశీ వలస విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటాడు.. కానీ, ఈ సారి మాత్రం గతానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అక్రమ వలసదారుల వల్ల దేశంలో నిరుద్యోగం, హింస, నేరాలు, దోపిడీలకు కారణమవుతున్నాయని పలు సందర్భంగా అడు ఆరోపణలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ తిప్పి వారి సొంత దేశాలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. అక్రమంగా వలస వచ్చే వారిపై తమ దృష్టి మొత్తం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రచార టీమ్ పలుమార్లు పేర్కొనింది. కాగా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చట్టబద్ద వలసదారులపైనా ఆంక్షలు విధించారు. కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ విధానంలో మార్పులు లాంటివి ఎన్నో చేశారు. 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే బై అమెరికన్- హైర్ అమెరికన్ పేరిట ఆదేశాలు జారీ చేశారు. అత్యంత నైపుణ్యం గల వారికి మాత్రమే బిజినెస్ వీసాలు జారీ చేసేలా గత సర్కార్ సంస్కరణలు చేపట్టింది. దీంతో అమెరికన్ల ఉపాధి అవకాశాలను రక్షించాలని వెల్లడించారు.