Donald Trump Health Report: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైద్య పరీక్షల నివేదిక విడుదలైంది. ట్రంప్ అసాధారణ ఆరోగ్యంతో ఉన్నట్లు నివేదిక వర్ణించింది. శుక్రవారం వైట్ హౌస్ విడుదల చేసిన నివేదికలో ఓ విస్తుపోయే నిజం వెల్లడైంది. ట్రంప్ హృదయ వయస్సు ఆయన వాస్తవ వయస్సు కంటే 14 సంవత్సరాలు చిన్నదని పేర్కొంది. ఈ వైద్య పరీక్షలను వైట్ హౌస్ వైద్యుడు సీన్ బార్బబెల్లా నిర్వహించగా.. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు.
READ MORE: S*x Racket: ఒక హోటల్.. ముగ్గురు అమ్మాయిలు.. డమ్మీ కస్టమర్.. భారీ సె**క్స్ రాకెట్ గుట్టురట్టు..
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వయస్సు 79 సంవత్సరాలు. జనవరిలో తిరిగి అధికారంలోకి వచ్చారు. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. ట్రంప్ హృదయ, ఊపిరితిత్తుల, నాడీ సంబంధిత, శారీరక పనితీరు అన్నీ అద్భుతంగా పని చేస్తున్నాయని డాక్టర్ బార్బబెల్లా నివేదికలో పేర్కొన్నారు. అధ్యక్షుడు తన రాబోయే అంతర్జాతీయ ప్రయాణానికి ముందు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, వార్షిక ఫ్లూ వ్యాక్సిన్, కొత్త COVID-19 బూస్టర్ టీకాలను వేసుకున్నారని తెలిపారు. రోగ నిరోధక శక్తి మెరుగు పరుచుకునేందుకు సహాయపడే అని చర్యలు తీసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. వైట్ హౌస్ నివేదిక ప్రకారం.. ట్రంప్ వైద్య పరీక్ష వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ (బెథెస్డా, మేరీల్యాండ్)లో జరిగింది. ఇది సాంప్రదాయకంగా అమెరికా అధ్యక్షులకు ప్రాథమిక వైద్య కేంద్రం. తాజాగా నిర్వహించిన ECG పరీక్షలో ట్రంప్ “గుండె వయస్సు” సుమారు 14 సంవత్సరాలు చిన్నదని, చాలా మెరుగ్గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. హృదయనాళ బలం 14 సంవత్సరాల చిన్న వ్యక్తికి సరిపోలుతుందని పరీక్షల ద్వారా కనుగొన్నారు.
READ MORE: BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ