Donald Trump Mug shot: 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ గత వారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత గురువారం ట్రంప్ జార్జియా జైలులో లొంగిపోయారు. అయితే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. అయితే అరెస్ట్ చేసినప్పుడు అందరి నిందుతులు లాగానే ట్రంప్ మగ్ షాట్ ( నిందుతులకు జైలులో తీసే ఫోటో) తీశారు. అయితే జైలు నుంచి విడుదల కాగానే ఈ ఫోటోను ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో పంచుకున్నారు. 2020 జనవరిలో ట్రంప్ ఖాతాను ట్విటర్ నిషేధించిన తరువాత తొలిసారి గత గురవారం అరెస్ట్ అయి విడుదలైన వెంటనే ఎక్స్ లో తన మగ్ షాట్ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. ఇక ఇప్పుడు ఆ మగ్ షాట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ట్రంప్ మగ్ షాట్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో టీషర్టులు, బీర్ కూజాలు, కాఫీ మగ్‌లు, బంపర్ స్టిక్కర్లు, పోస్టర్లు తయారు చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో విక్రయిస్తున్నారు. ఇవి క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. అంతేకాకుండా ఆ మగ్ షాట్ ఫోటో కింద ‘నెవర్ సరెండర్’(ఎప్పుడూ లొంగిపోవద్దు) అని కూడా ప్రింట్ చేశారు.
Also Read:
ఇవి విపరీతంగా అమ్ముడుపోవడం ట్రంప్ కు కాసులు వర్షం కురిపిస్తోంది. జైలులో గన్ షాట్ తీయించుకున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక రాబోయే ఎన్నికల కోసం ట్రంప్ కు విపరీతంగా విరళాలు అందుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తరువాత ట్రంప్ కు కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 71 లక్షల డాలర్లు (రూ. 58 కోట్ల) విరాళాలు అందాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచార సిబ్బంది కూడా అధికారికంగా ధ్రువీకరించింది. ఇక తన ఖాతను ట్విటర్ (ఎక్స్) నిలిపివేసినప్పుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ ను వాడారు. అయితే ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేయడమే కాకుండా ట్రంప్ ను మళ్లీ ట్విటర్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో చాలా రోజుల వచ్చి ట్రంప్ పెట్టి తొలి ఫోటో మగ్ షాట్ సంచలనంగా మారింది. ఇక ముందు ముందు ట్రంప్ ఎక్స్(ట్విటర్) లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలి.