NTV Telugu Site icon

Viral Video: డెడికేషన్ అంటే ఇది భయ్యా.. ట్రాఫిక్ లో చిక్కుకున్న కస్టమర్ కు పిజ్జా అందించిన డామినోస్ డెలివరీ బాయ్

Pizza

Pizza

డెలివరీ బాయ్స్ డెడికేషన్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఎండలు మండిపోతున్నా, వానలు దంచికొడుతున్నా, చలి వణికిస్తున్న ఆర్డర్ తీసుకున్నారంటే కరెక్ట్ టైంకు కస్టమర్ కు అందిస్తారు. తాజాగా వారి నిబద్దతను తెలిపే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగుళూరు వాసులు నిన్న ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. రెండు కిలోమీటర్లు వెళ్లడానికి వారికి రెండు గంటలకు పైగా పట్టింది. దీంతో దాదాపు ఐదు ఆరు గంటలు చాలా మంది ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇంత సేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం అని ఊహించని వారు డామినోస్ నుంచి పిజ్జాలు అర్డర్ చేశారు.

Also Read: Share Wale Baba: ఈయన అవతారం చూసి మోసపోకండి.. రూ.100 కోట్ల షేర్లకు అధిపతి

అయితే ట్రాఫిక్ లో ఇరుక్కు పోవడంతో వారు ఆ విషయాన్ని డామినోస్ సిబ్బందికి చెప్పారు. వారి డెలివరీ బాయ్స్ లైవ్ ట్రాకింగ్ ద్వారా అంత ట్రాఫిక్ లో వారిని వెతుక్కుంటూ వచ్చి రోడ్డుపైనే డెలివరీ అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో.. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇంతలో డామినోస్ పిజ్జా డెలివరీ సిబ్బంది స్కూటీపై వచ్చి ఓ కారు ముందు ఆగారు. కారులో కూర్చున్న వారికి పిజ్జా అందించి వారు అక్కడి నుంచి వెళ్లిపోవడం మనం చూడవచ్చు. దీంతో ఎంతో ఆకలిగా ఉన్న తమకి అంత ట్రాఫిక్ లో కూడా డామినోస్ సిబ్బంది పిజ్జాలు అందించింది అంటూ కస్టమర్ రిషివన్త్ ఈ వీడియోను తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు ఆ డెలివరీ బాయ్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారి డెడికేషన్ కు, డెలివరీకి, టైమింగ్ కు టేక్ ఏ బౌ అంటున్నారు.