NTV Telugu Site icon

Viral News: పిగ్గీ బ్యాంకులో 23 నాణేలు వేసిన కుక్క.. ప్రపంచ రికార్డు..!

Dog

Dog

Viral News: సాధారణంగా మనం పెంచుకునే కుక్కలు మనం చెప్పినట్టుగా ఉంటాయి. సరదాగా ఆడుకోవడం కానీ.. లేకపోతే ఇంటికి ఎవరైనా కొత్తవారు వస్తే మొరగడం లాంటి పనులు చేస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే కుక్కను పెంచుకుంటే.. మనిషితో ఉన్నంత ఫీలింగ్ ను పొందుతారు. ఏదేతైనేం మాములుగా మనుషులు గిన్నీస్ రికార్డులోకెక్కడం విన్నాం. కానీ కొత్తగా కుక్క గిన్నీస్ బుక్ లో రికార్డ్ సృష్టించింది. ఎక్కడా అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో ఉంచి ప్రపంచ రికార్డు సృష్టించింది ఓ కుక్క. స్కాట్లాండ్‌కు చెందిన ఈ నాలుగేళ్ల కాకర్ స్పానియల్ లియో.. ఒక నిమిషంలో 23 నాణేలను పిగ్గీ బ్యాంకులో వేసి గిన్నీస్ రికార్డ్ సంపాదించింది. కుక్కలకు ఇలాంటి ఐడియాలు చెప్పడం అంత తేలికైన కాదు. ప్రత్యేకించి చిన్న నాణేలను తీయడం మరియు వాటిని పిగ్గీ బ్యాంక్‌లో వేయడం చాలా కష్టమైన పని.

Read Also: Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్‌కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?

ఫిబ్రవరి 24, 2023న స్కాట్లాండ్‌లోని పిట్‌కాపుల్‌లోని లోగీ డర్నో విలేజ్ హాల్‌లో జరిగిన పబ్లిక్ ఈవెంట్‌లో లియో రికార్డ్ సృష్టించగా.. దానికి సంబంధించి జూన్ 3న సర్టిఫికేట్ పొందింది. లియో యజమాని ఎమిలీ ఆండర్సన్ GWR సర్టిఫికేట్‌తో లియో చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “లియో ఇప్పుడు అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని చెప్పుకొచ్చాడు. లియో 1 నిమిషంలో 10పైసల నాణేలను 23 తన పిగ్గీ బ్యాంకులో ఉంచిందని తెలిపాడు. అంతేకాకుండా లియో చేసిన రికార్డ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. దానికి 3,000కు పైగా లైక్‌లు వచ్చాయని అండర్సన్ తెలిపాడు. అంతేకాకుండా అలా పిగ్గీ బ్యాంక్ లో నాణేలు వేసేందుకు లియోకు రెండేళ్లపాటు శిక్షణ ఇచ్చానని అండర్సన్ చెప్పుకొచ్చారు.