టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ఆడియన్స్ ముందుకు రాబోతోంది.. విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లాడు..
ఆ కార్యక్రమానికి బుల్లి తెర పై ఎన్నో సీరియల్స్ తో అలరిస్తున్న హీరోలు, హీరోయిన్లు హాజరై సందడి చేశారు.. అందరు విజయ్ దేవరకొండ తో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.. అందరిలాగే ఓ సీరియల్ హీరో కూడా ఫోటోలను తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన విజయ్ ఫ్యాన్స్ అచ్చం విజయ్ అన్నలాగే ఉన్నాడు ఇంకో తమ్ముడు ఏమైనా ఉన్నాడా అంటూ కామెంట్స్ చేశారు..
అయితే గతంలో కూడా యశ్వంత్ పెట్టిన ఫోటోలు వీడియోలు కింద మీరు విజయ్ దేవరకొండలా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. వాటికి ఎన్నోసార్లు రిప్లై కూడా ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ తోనే సెల్ఫీ తీసుకొని నెట్టింట ఫోటో పెట్టేసరికి ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. ఇక విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో భారీ క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ స్టాల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా జనాలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..