Site icon NTV Telugu

Chhattisgarh: డాక్టర్ అత్యుత్సాహం.. ‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’.. ప్రధాని వ్యాఖ్యలను క్లినిక్ కోసం వాడిన వైనం

Doctor

Doctor

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్యుడు యూరాలజీ క్లినిక్ పబ్లిసిటీ కోసం పాకిస్తాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన తీవ్ర వ్యాఖ్యలను క్రియేటివిటీగా ఉపయోగించి సోషల్ మీడియాలో దుమారం రేపాడు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ప్రతీకార దాడి ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను తెలివిగా వాడిన యూరాలజిస్ట్ అయిన శివేంద్ర సింగ్ తివారీ సోషల్ మీడియాలో తన క్లినిక్ కోసం ప్రమోషనల్ ప్రకటనను పోస్ట్ చేశారు.

ALSO Read:Karimnagar: యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి..

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 12న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డాక్టర్ శివేంద్ర సింగ్ తివారీ కూడా ప్రధాని మాటలను శ్రద్ధగా విన్నారు. వ్యాపారం, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు. ఇక్కడ రక్తం, నీరు అనే పదం ద్వారా ప్రధానమంత్రి ఉగ్రవాద దాడులనుచ సింధు జల ఒప్పందం (IWT) గురించి ప్రస్తావించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆ వైద్యుడు అత్యుత్సాహం చూపాడు. క్లినిక్ యాడ్స్ కోసం యూజ్ చేశాడు.

ALSO Read:Kavya Thapar : బికినీలో కావ్య థాపర్.. బోల్డ్ ఫొటోస్

రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధానమంత్రి అన్నారు. కాబట్టి, మీ మూత్రంలో రక్తం కనిపిస్తే, వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. ఇది తీవ్రమైనది కావచ్చు అని ప్రకటనలో రాసుకొచ్చాడు. దీనికి సంబంధించిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది. యూరాలజిస్ట్ సార్ విపత్తులో అవకాశం కోసం చూస్తున్నారు, గొప్ప మార్కెటింగ్ పాయింట్, డాక్టర్ ఎంబీబీఎస్ తో పాటు ఎంబీఏలో మార్కెటింగ్ చదివారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వైద్యుడి పోస్ట్ వైరల్ కావడంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. డాక్టర్ శివేంద్ర సింగ్ తివారీని 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Exit mobile version