Site icon NTV Telugu

Janhvi Kapoor : దేవర సినిమాలో జాన్వీ పాపకు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా ?

Janvi (3)

Janvi (3)

Janhvi Kapoor : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజై ఆయన అభిమానులు ఆరేళ్ల ఆకలిని తీర్చింది. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. పాన్ వరల్డ్ లెవల్లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టుతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ అని చిత్ర యూనిట్ ముందు నుంచి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ సినిమా చూస్తే జాన్వీ సినిమా మొత్తం మీద అరగంట కూడా సరిగ్గా కనిపించలేదు. దీంతో ఈ మాత్రం పాత్రకు జాన్వీ కపూర్ అవసరమా అని అభిమానులు తిట్టుకుంటున్నారు.

Read Also:ArshadWarsi : మరోసారి ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు..

కానీ జాన్వీ కనిపించిన కాసేపైనా తన అందచందాలతో బాగానే మెప్పించింది. అయితే జాన్వీకి తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ బాగానే సెట్ అయిందని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇంతకీ జాన్వీకి తెలుగు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? ఆర్జేగా పాపులారిటీ తెచ్చుకున్న పీవీఎస్ శ్వేత జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది. ఆర్జే గా ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మరింత పాపులర్ అయి బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. రచయితగా, నటిగా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, మెయిన్ ఫిలిమ్స్ కి పనిచేసింది శ్వేత. త్వరలో డైరెక్టర్ గా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్వేత దేవర గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ.. దేవరలో జాన్వీ కపూర్ కి నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ అది ఎవరూ గుర్తుపట్టలేదు. ట్రైలర్స్ వచ్చిన తర్వాత కూడా నా వాయిస్ ని ఎవరూ గుర్తుపట్టలేదు. మన వాయిస్ ని ఎవరూ గుర్తు పట్టనప్పుడే డబ్బింగ్ ఆర్టిస్ట్ సక్సెస్ అయినట్టు. ఇటీవల చాలా సినిమాల్లో డబ్బింగ్ చెప్పాను కానీ ఎవరూ గుర్తుపట్టలేదు అంటూ చెప్పుకొచ్చింది.

Read Also:Udhayanidhi Stalin: ఉపమముఖ్యమంత్రిగా నేడే ఉదయనిధి ప్రమాణస్వీకారం!

Exit mobile version