సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో హీరోయిన్ కు డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది.పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటి అవకాశాలు కనుక వస్తే వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది..స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు గా తానేంటో నిరూపించుకున్నారు.ఎలాంటి పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో పూర్తి న్యాయం చేస్తారు ఎన్టీఆర్.. ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గాను గుర్తింపు పొందారు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లో ఎంతో బిజీ గా వున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కు ఎప్పటి నుంచో ఈ పాత్రలో నటించడం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం.ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించే అవకాశం మాత్రం రాలేదని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటి అనే విషయానికి వస్తే…. ఎన్టీఆర్ తాతగారు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించారు అయితే తన తాత గారిని కృష్ణుడి పాత్రలో చూసిన ఎన్టీఆర్ ఎంతో ఆనంద పడేవారని సమాచారం.తాను కూడా ఇలాంటి పాత్రలో నటించాలని కోరుకునేవారట.అయితే కృష్ణుడి వేషంలో కనిపించే పాత్రలు ఎన్టీఆర్ కి అసలు రాలేదు. బృందావనం సినిమాలో ఒక పాటలో ఎన్టీఆర్ మోడరన్ కృష్ణుడిగా కనిపించినప్పటికీ అది ఫుల్ లెన్త్ సినిమా కాదు దీంతో ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించాలన్న కోరిక అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది.మరి త్వరలో తెరకెక్కబోయే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతంలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర దక్కించుకుంటారో లేదో చూడాలి.
