Nani : “సరిపోదా శనివారం” మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’ ఈ మూవీ తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.శౌర్యవ్ అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.. ఈ మూవీ తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా ను చేస్తున్నాడు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోకపోవడంతో ఈసారి వీరి కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుంది. ఈ మూవీలో నానిని వివేక్ ఆత్రేయ కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు.కొద్ది రోజుల క్రితమే ‘సరిపోదా శనివారం’ అన్ చైన్డ్ వీడియోని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై నాని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్ళిన నాని అక్కడి వాళ్లతో మాట్లాడుతూ, ‘సరిపోదా శనివారం మూవీని వచ్చే ఏడాది ఆగస్టు నెలలో రిలీజ్ కి రెడీ చేస్తున్నట్లు’ చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప 2′ విడుదల కాబోతోంది.’పుష్ప 2’ రిలీజైన రెండు వారాలకి నాని ‘సరిపోదా శనివారం’ మూవీని విడుదల చేసేందుకు మూవీని ప్లాన్ చేసినట్లు సమాచారం.. అయితే మూవీ టీం రిలీజ్ డేట్ ని ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు.. కాగా ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో వీరిద్దరి పెయిర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరోసారి ‘సరిపోదా శనివారం’లో జతకట్టారు.అలాగే కోలీవుడ్ అగ్ర నటుడు SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!