బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ గత ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.యానిమల్ మూవీలో రణ్ బీర్ కపూర్‌తో పాటు రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ మరియు ప్రేమ్ చోప్రా నటించారు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల రిలేషన్ గురించి చాలా వైల్డ్ గా సందీప్ చూపించారు.తాజాగా బాలీవుడ్ ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ మూవీపై తన భార్య మనీషా మరియు కుమారుడు అర్జున్ రెడ్డి ఎలా స్పందించారో సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు.ఆ ఇంటర్వ్యూలో “యానిమల్ గురించి ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతుంది కదా. మరి మీ ఏడేళ్ల కుమారుడు అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాను చూశాడా?” అని సందీప్ రెడ్డి వంగాను సిద్ధార్థ్ కన్నన్ ప్రశ్నించారు..
దానికి “చూపించకూడని కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసిన యానిమల్ మూవీని ఓ హార్డ్ డిస్క్‌లో ఉంచాం. ఏ రేటింగ్ సీన్స్ ఉన్న సీన్‌లన్నీ కత్తిరించిన యానిమల్ ఎడిట్ వెర్షన్‌ను న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో నా కొడుకుకు చూపించాను. అది వాడికి బాగా నచ్చింది” అని సందీప్ రెడ్డి వంగా తెలిపాడు.”అయితే యానిమల్ సినిమాలో అండర్‌వేర్ యాక్షన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయని నా కొడుకు చెప్పాడు. ఇక సినిమాలో స్త్రీ పాత్రలను చూపించిన విధానంపై నా భార్య ఏమీ చెప్పలేదు. కానీ, రక్తపాతం విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజానికి నా సినిమాలకు సంబంధించి ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచే లభిస్తుంది. నేను ఒక ఫిల్మ్ మేకర్‌గా దానిని ఎంతో సీరియస్‌గా తీసుకుంటాను. అర్జున్ రెడ్డి అంత సక్సెస్ కావడానికి కారణం నా కుటుంబమే” అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు.