NTV Telugu Site icon

Tamanna Bag: వామ్మో.. మిల్కీ బ్యూటీ బ్యాగు ఖరీదు తెలిస్తే షాకే

Tamanna Bag

Tamanna Bag

Tamanna Bag: సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే లుక్ బాగుండాలి.. చూడగానే ఎట్రాక్ అయ్యే విధంగా మాటతీరు.. స్టైల్ ఉండాలి. అందుకోసమే సినిమా వాళ్లు డ్రెస్‌లు, యాక్సెసరీలు భారీగా డబ్బులు పోసి కొంటుంటారు. చిన్నపాటి బ్యాగు, మామూలు డ్రెస్‌, వాచ్‌, షూస్‌.. ఇలా ఏది తీసుకున్నా వాటి ధర మామూలుగా ఉండదు. స్టార్లు ఏదైనా ఈవెంట్‌కి హాజరైనప్పుడు, ఎయిర్‌పోర్ట్‌ లో కనిపించినప్పుడు ఇలాంటివి జనాల కంట పడుతుంటాయి. తాజాగా తమన్నా కూడా ఇలాంటి ఓ కాస్ట్‌లీ యాక్సెసరీతో కనిపించి మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆ వస్తువు ధర ఎంత అంటూ గూగుల్ సెర్చ్‌ చేయడం స్టార్ట్ చేశారు. దాని ధర చూసేసరికి వారికి కళ్లు భైర్లు కమ్మాయి.

Read Also:Malakpet Crime: మొండెం లేని తల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు.. రంగంలోకి 8 బృందాలు

మంచు మనోజ్ సరసన ‘శ్రీ’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో కొంత కాలం గ్యాప్ వచ్చింది. మరళ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’ సినిమాలో నటించింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో తిరుగులేని స్టార్ డమ్ వచ్చింది. దీంతో తమన్నా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ ఇండియాలో సుమారుగా దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది ఆమె అందం ఇసుమంత కూడా తగ్గట్లేదు. ఈమె కోలీవుడ్, బాలీవుడ్ ని కూడా వదలలేదు. అందం తో పాటు అద్భుతమైన నటన మరియు డ్యాన్స్ వచ్చిన తమన్నా సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉంటుంది.

Read Also:Italy Floods: ఉత్తర ఇటలీలో వరదల బీభత్సం.. 9 మంది మృతి, ఫార్ములా వన్ రేసు రద్దు

తమన్నా చాలామందికి రోల్ మోడల్. దీని కారణంగా ఆమెను సోషల్ మీడియా లో ఫాలో అవుతుంటారు. తాను అప్లోడ్ చేసే ఫోటోలలో ఆమె ధరించే దుస్తులు వగైరా వంటివి వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే తారలు ఆమె వాడే వస్తువులను, దుస్తులను తాము కూడా వాడాలని అభిమానుల పరితపిస్తుంటారు. అలాగే రీసెంట్ గా ఆమె విమానాశ్రయం లో కనిపించిన ఒక ఫోటో లో ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. అది కొనుగోలు చేద్దాం అని గూగుల్ లో వెతికి కొనుగోలు చెయ్యబోతుండగా రేట్స్ చూసి ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయినంత పని అయ్యింది. ఈ బ్యాగ్ ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలట. మిడిల్ క్లాస్ మనుషులకు కేవలం చూసేదానికి మాత్రమే, కొనేదానికి సరిపోదు.